ఇల్లు శుద్ధ క్రయ పురోణి

గజం ఒక్కింటికీ రూ. /-(అక్షరాలలో రూపాయలు) చదరపు గజములు సుమారు గాగల RCC స్లాబ్ ఇల్లు సహిత ఖాళీస్థలమునకు క్రయపురోణి


తేదీ: ని


వ్రాయించుకున్నవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారికివ్రాయించియిచ్చినవారు : రాష్ట్రం, జిల్లా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) డోర్ నెం./ఫ్లాట్ నెం., కాపురస్తులు గారి (భార్య/కుమారుడు/కుమార్తె) వయస్సు (ఆధార్ నెం. ) (పాన్ నెం. ) గారు వ్రాయించి యిచ్చిన స్థిరాస్థి RCC స్లాబ్ ఇల్లు సహిత ఖాళీ నివేశనస్థలమునకు క్రయ అగ్రీమెంట్.ఇందలి మూడవ పేరా షెడ్యూల్ దాఖలా ఆస్థి నాకు క్రయములకముగా అనగా వగైరాల వలన సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో రిజిస్టర్ కాబడిన క్రయ దస్తావేజు నెం. / రుగా దఖలుపడి తదాది నేటి వరకూ నా యొక్క సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములలోగల తదాది నేటి వరకు నాస్వాధీనలో యున్నటువంటిన్ని, నాకు తప్ప ఇతరులెవ్వరికి ఎట్టిహక్కు అనుభవములు లేనటు వంటిన్ని RCC స్లాబ్ ఇల్లు సహితా ఖాళీస్తలమును అందు నాకు గల సమస్త ఈజిమెంట్ హక్కులతోడనూ మీకు క్రయానికి ఇవ్వ నిర్ణయించు కున్న క్రయధనం గజం ఒక్కింటికీ రూ. /-(అక్షరాలలో రూపాయలు) నిర్ణయించుకోవడమైనది ఇందుకు గానూ మీవద్ద నుండీ అడ్వాన్సుగా రూ. /-(అక్షరాలలో రూపాయలు) అగ్రీమెంట్ వ్రాతకాలమందు నగదుగాను నాకు ఈదిగువ సాక్షి సంతకం దార్లు ఎదుట ఈరోజున యిచ్చినందున నాకు ముట్టినది. గనుక మీ, మా సమక్షంలో కొలతలు కొలిపించగా వచ్చిన విస్తీర్ణమునకు పైరేటు చొప్పునధర చెల్లించు కొనుటకు నిర్ణయం. ఇoతట నుండి రోజులలోగా సదరు క్రయాస్థికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు కావలసిన యావత్తు రికార్డులు వగైరాలు నేనే మీకు అందజేసిన పిదప మీ స్వంత ఖర్చులతో, అనగా మీ పేరున గానీ, మీరు కోరినవారి పేరున గానీ మీరు ఇచ్చిన ముసాయిదా ప్రకారం, నేను నావారసులము కలసి క్రయదస్తావేజు లేక క్రయదస్తావేజులు వ్రాయించి, రిజిష్టరీ చేయించి మీ స్వాధీనం చేయ గలవాడను. ఈఆస్దిపై నావలన గానీ, నావారసుల వలన గానీ, నాదాయాదుల వలన గానీ, అభ్యంతరములు, ఆక్షేపణలుగానీ కోర్టులావాదేవీలు గానీ, తనఖాలుగానీ వగైరావి ఎదురయిన ఎడల అట్టివాటిని నాస్వంత జవాబుదారీ పైని, నాఇతర చర స్దిరాస్తుల జవాబుదారీ పైనిన్నీ పరిష్కరించి ఈక్రయపురోణీ దాఖలా ఆస్థిని నిరాటంకముగా మీకే సిద్దింపచేయగలవాడను. అని ఈదిగువ సాక్షి సంతకములు చేసిన పెద్ద మనుషుల సమక్షంలో అంగీకరించి, ఈక్రయపురోణి అగ్రిమెంటును నాపూర్తి సమ్మతిని వ్రాయించడమైనది. సదరు ఆస్థిపై నేటివరకూ ఎటువంటి పురోణీలు గానీ, తగవులు గానీ, బ్యాంకు ఋణములు గానీ, మరి ఏవిదమయిన అన్యాక్రాంతములకు లోబర్చి యుండనటువంటి నిర్వివాద నిస్పేచ్చీ గల ఆస్థి అని మిమ్ము నమ్మించి మీ పేరున ఈక్రయపురోణీ పత్రము వ్రాయించి ఈయడమైనది.


ఆస్థి వివరం


జిల్లా, సబ్..రి..యీలాకా, మండలం, (గ్రామం/మున్సిపాలిటీ) పంచాయతీకి చెందిన రెవిన్యూ పరిధిలో చేరియున్నటి వంటిన్నీ, సర్వే నెం. రు లోగల సుమారు చదరపు గజములు గాగల RCC స్లాబ్ ఇల్లు సహితా ఖాళీస్థలమునకు హద్దుల వివరం.

మొత్తం స్థలం యొక్క కొలతలు:-


తూర్పు పడమర్లకు :
ఉత్తర దక్షిణములకు :


RCC స్టాబ్ యొక్క కొలతలు:-


తూర్పు పడమర్లకు :
ఉత్తర దక్షిణములకు :


హద్దులు


తూర్పు :
పడమర :
ఉత్తరం :
దక్షిణం :


పైన వివరించిన హద్దుల మద్య గల సుమారు చదరపు గజములు ఈక్రయపురోణీ అగ్రిమెంట్ ఆస్ది అయిఉన్నది. చదువుకున్నాను, చదవగావిన్నాము సరిగాఉన్నదని అంగీకరించి ఈదిగువ సంతకములు చేయడమైనది.
వ్రాయించి ఇచ్చినవారు

యింద్కు సాక్షులు:1.2.